మెగా హీరో పాత్రను హైలైట్ చేస్తూ హరీశ్ శంకర్ 'వాల్మీకి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా హీరో పాత్రను హైలైట్ చేస్తూ హరీశ్ శంకర్ 'వాల్మీకి'

  • 2014లో వచ్చిన 'జిగర్తాండ'
  • బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్
  • కథలో భారీ మార్పులు
హరీశ్ శంకర్ రీమేక్ చేసినా అది హీరో బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటుంది. ఆ హీరో నుంచి అభిమానులు ఆశించే అంశాలతో పాటు నేటివిటీకి తగినట్టుగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా 'గబ్బర్ సింగ్' సినిమాను గురించి చెప్పుకోవచ్చు. అలాంటి హరీశ్ శంకర్ తాజాగా మరో రీమేక్ తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 2014లో తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి ఇది రీమేక్.ఈ సినిమాకి తెలుగులో 'వాల్మీకి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ తరహా పాత్రను చేయడానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే తమిళంలో సినిమా క్లైమాక్స్ లో బాబీ సింహా పాత్ర కామెడీగా మారిపోతుంది. అలా కాకుండా వరుణ్ తేజ్ పాత్రను హైలైట్ చేస్తూ, కథలోను .. పాత్ర తీరు తెన్నుల్లోనూ భారీగా మార్పులు చేస్తున్నారట. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
varun tej

More Telugu News