ప్రేమ జంట ఇంట విషాదం: భార్య నిండు గర్భిణి... భర్త రోడ్డు ప్రమాదంలో మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ జంట ఇంట విషాదం: భార్య నిండు గర్భిణి... భర్త రోడ్డు ప్రమాదంలో మృతి!

  • మూడు రోజు క్రితం భర్తకు రోడ్డు ప్రమాదం
  • చికిత్స పొందుతూ రెండురోజుల అనంతరం మృతి
  • నెల రోజులు క్రితమే భార్య సీమంతం
అన్యోన్యంగా సాగుతున్న ఆ ప్రేమ జంటను చూసి విధికి కూడా కన్నుకుట్టిందేమో. రోడ్డు ప్రమాదం రూపంలో ఒకరిని దూరంచేసి మరొకరికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌ లో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌ (29) జీడిమెట్లలోని అపురూప కాలనీలో నివాసం ఉంటున్నాడు. విశాఖకు చెందిన ఇతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య ఏడు నెలల గర్భిణి. నెల రోజుల క్రితమే ఆమెకు సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి వస్తున్న ప్రభాకర్‌ ద్విచక్ర వాహనాన్ని గండిమైసమ్మ చౌరస్తావద్ద వెనుక నుంచి వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి షిప్ట్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రెండురోజుల అనంతరం మృతి చెందినట్లు దుండిగల్‌ పోలీసులు తెలిపారు. భార్య నిండు గర్భిణిగా ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
Road Accident
one died
Hyderabad
visakhapatnam

More Telugu News