ప్రేమ జంట ఇంట విషాదం: భార్య నిండు గర్భిణి... భర్త రోడ్డు ప్రమాదంలో మృతి!
- మూడు రోజు క్రితం భర్తకు రోడ్డు ప్రమాదం
- చికిత్స పొందుతూ రెండురోజుల అనంతరం మృతి
- నెల రోజులు క్రితమే భార్య సీమంతం
ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి వస్తున్న ప్రభాకర్ ద్విచక్ర వాహనాన్ని గండిమైసమ్మ చౌరస్తావద్ద వెనుక నుంచి వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి షిప్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రెండురోజుల అనంతరం మృతి చెందినట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు. భార్య నిండు గర్భిణిగా ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.