టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. మ్యాచ్ నుంచి ధోనీ అవుట్

  • తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీ
  • ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్
  • మళ్లీ జట్టులోకి వచ్చిన పాండ్యా
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనూయ్‌లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు.  

నేపియర్, మౌంట్ మాంగనూయ్‌లలో జరిగిన తొలి, రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకుని  సిరీస్‌ను ఇక్కడే దక్కించుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, దారుణమైన ఆటతీరుతో పర్యాటక జట్టుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాగా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ షమీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి కోలిన్ మన్రో (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
Go Back to Shorts
Team India
Kiwis
New zealand
MS Dhoni
Virat Kohli

More Telugu News