అజాగ్రత్త ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది!
- రైలు ఢీకొట్టి యువతి దుర్మరణం
- ఫోన్లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దుర్ఘటన
- ఆగ్రా నగరంలో ఘటన
శుక్రవారం ఎప్పటిలా శిక్షణ కోసం వెళ్లి వస్తూ ఆగ్రా రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ రైలు వంతెన కింద నుంచి పట్టాలు దాటుతోంది. అదే సమయంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నప్పుడు రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.