పనిపిల్లను వేధిస్తున్నారంటూ.. సినీనటి భానుప్రియపై పోలీసు కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పనిపిల్లను వేధిస్తున్నారంటూ.. సినీనటి భానుప్రియపై పోలీసు కేసు నమోదు

  • సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళ ఫిర్యాదు
  • భానుప్రియ అన్న లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణ
ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏడాది క్రితం 14 ఏళ్ల సంధ్య అనే తన కుమార్తెను చెన్నైలో ఉన్న భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని... అప్పటి నుంచి తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని సామర్లకోట మండలానికి చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏడాది కాలంగా తన కుమార్తెను ఇంటికి పంపడం లేదని, ఫోన్ లో మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భానుప్రియ అన్న తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. గట్టిగా మాట్లాడితే తన కూతురుపై చోరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో భానుప్రియ, అతని సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు చెన్నై వెళ్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ ఆరోపణలపై భానుప్రియ ఇంతవరకు స్పందించలేదు.
bhanupriya
police
case
tollywood

More Telugu News