చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

  • హైదరాబాద్‌ మొదటి మెట్రోపాలిటన్‌ సెషన్స్ కోర్టు తీర్పు
  • గత ఏడాది ఫిబ్రవరిలో ఘటన
  • కేసు నమోదు చేసిన మారేడుపల్లి పోలీసులు
అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి లైంగికంగా దాడి చేసిన వ్యక్తికి హైదరాబాద్‌లోని మొదటి మెట్రోపాలిటన్‌ సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధించింది. మారేడుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మారేడుపల్లి పరిధిలోని ఓ బస్తీలో నివసిస్తున్న కుటుంబంలో నాలుగేళ్లు, రెండున్నరేళ్ల చిన్నారులు ఉన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఈ చిన్నారులు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లారు. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన పి.అనిల్‌కుమార్‌  (50) వారిని పిలిచి చాక్లెట్లు ఇస్తానని నమ్మించి తన వెంట తీసుకువెళ్లాడు. అనంతరం ఓ బాలికపై లైంగిక దాడిచేసి, మరో బాలికను బెదిరించాడు. విషయం తెలిసిన బాధిత చిన్నారుల తల్లిదండ్రులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు అనిల్‌ కుమార్‌ను అరెస్టుచేసి కోర్టు ముందుంచారు. కేసు విచారించిన న్యాయమూర్తి నిందితుడు నేరం చేశాడని రుజువు కావడంతో ఈ విధంగా తీర్పు చెప్పారు.
sexuval herashment
10 years prision
Hyderabad

More Telugu News