నేడు పరిటాల రవి వర్ధంతి.. ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • రవి అందించిన సేవలు మా మనసుల్లో నిలిచి ఉంటాయి
  • బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
ఏపీ మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. పరిటాల రవి మన మధ్య లేకున్నా, ఆయన అందించిన సేవలు తమ మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటాయన్నారు. ఏపీ సీఎం ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘టిడిపి నేత, మాజీ మంత్రి పరిటాల రవి వర్థంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. భౌతికంగా రవి మా మధ్య లేకున్నా పార్టీ అభివృద్ధి కోసం తాను చేసిన కృషి, అందించిన సేవలు మా మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అమ్మాయిలకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి, లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ రాష్ట్రంలో బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబంతో పాటు సమాజం కూడా వారికి చేయూతనిచ్చి, అండగా నిలవాలని పిలుపునిస్తున్నాను. #NationalGirlChildDay’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Twitter
paritala ravi
death anniversary

More Telugu News