ఏలకులను తీసుకుపోలేదట... సైనిక హెలికాప్టర్ ను అడ్డుకున్న 11 గ్రామాల ప్రజలు!
- అరుణాచల్ ప్రదేశ్ లో ఘటన
- ఏలకుల రవాణా ఒప్పందంపై ఏఎల్జీని శుభ్రపరిచిన ప్రజలు
- తీసుకెళ్లకపోవడంతో ఆగ్రహంతో చాపర్లను ల్యాండింగ్ కానివ్వని వైనం
తాము పండించే ఏలకుల ఉత్పత్తులను మియావో ప్రాంతానికి తీసుకెళ్లాలన్న ఒప్పందంపై వారు హెలీప్యాడ్లను శుభ్రం చేశారని, అయితే, సైనిక హెలికాప్టర్లలో ఏలకులను తీసుకెళ్లేందుకు నిరాకరించడంతోనే గ్రామ ప్రజలు చాపర్లను అడ్డుకున్నారని చెప్పారు. తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పక్కనే ఉన్న మియావోకు వీరు వెళ్లాల్సివుంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో వీరు దాదాపు 157 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సివుంటుంది. హెలికాప్టర్ లో అయితే, సులువుగా చేరుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రజలు ఏఎల్జీని శుభ్రపరిచారని కమలాంగ్ తెలిపారు.