జగన్ పై దాడి కేసు డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వలేం: కోర్టుకు తెలిపిన సిట్ అధికారులు
- ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం
- హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది
- దీన్ని విచారించే అర్హత కింది కోర్టుకు లేదు
అయితే, కోర్టు తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు జరిగిన విచారణలో తమ విచారణ డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వలేమని కోర్టుకు సిట్ తెలిపింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారమని... దీనికి సంబంధించి కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని... దీంతో, దీనిని విచారించే అర్హత కింద కోర్టుకు లేదని సిట్ అధికారులు తమ వాదనలను వినిపించారు.