ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న అప్ డేట్!

  • గత ఐదేళ్లలో రెండే సినిమాల్లో కనిపించిన ప్రభాస్
  • ఆగస్టులో రానున్న 'సాహో'
  • ఆపై నాలుగు నెలల వ్యవధిలో మరో చిత్రం
గడచిన ఐదేళ్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా, విడుదలైన చిత్రాలు కేవలం రెండు మాత్రమే. రెండు భాగాల 'బాహుబలి' తరువాత ప్రస్తుతం 'సాహో'లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలకానుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇక ఇదే సంవత్సరం చివరిలో ప్రభాస్ హీరోగా, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెెక్కుతున్న చిత్రం కూడా విడుదలవుతుందట.

ఈ వార్త బయటకు రాగానే ప్రభాస్ ఫ్యాన్స్, తమ అభిమాన హీరో నటించే రెండు చిత్రాలు ఒకే సంవత్సరంలో వస్తాయని ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, జనవరిలో విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే, 'సాహో' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, ఈ సినిమాకూ ప్రభాస్ డేట్లను కేటాయించడంతో, అనుకున్న సమయంకన్నా ముందుగానే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. దీంతో 'సాహో' విడుదలైన నాలుగు నెలల్లోపే ప్రభాస్ మరో సినిమా రానుందట.
Go Back to Shorts
Prabhas
Sahoo
Bahubali
Fans

More Telugu News