చిన్ననాటి స్నేహితురాలితో హార్దిక్ పటేల్ పెళ్లి.. తేదీని ప్రకటించిన కుటుంబ సభ్యులు!
- స్వగ్రామం దిగ్సార్ లో వివాహ వేడుక
- నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయం
- పటేళ్ల రిజర్వేషన్ కోసం హార్దిక్ పోరాటం
సన్నిహితులైన దాదాపు 100 మందిని మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పారిఖ్ కూడా పటేల్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని హార్దిక్ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమె గాంధీనగర్ లో ఎల్ఎల్ బీ చదువుతోందని పేర్కొన్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరుతో హార్దిక్ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు.