కొన్ని వార్తాసంస్థలకు ఇంగితజ్ఞానం కూడా ఉండదు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • పీఎం కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ యాగాలు
  • వార్తను అందించిన సీఎన్ఎన్ న్యూస్ 18
  • కనీస ఇంగితజ్ఞానం లేదన్న కేటీఆర్
ఓ దినపత్రికలో తాను ప్రధానమంత్రిని కావాలన్న ఉద్దేశంతోనే యజ్ఞాలు, యాగాలు చేయిస్తున్నానని కేసీఆర్ చెప్పినట్టు వచ్చిన వార్తపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మూడు యాగాలు చేయిస్తున్నారంటూ సీఎన్ఎన్ న్యూస్ 18 ఓ వార్తను అందించగా, దాన్ని చూసిన ఓ నెటిజన్, కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ, ఇది తప్పుడు వార్తలా ఉందని స్పందించాలని కోరాడు. ఆపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "కొన్ని వార్తా సంస్థలు కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా, నిజానిజాలను పరిశీలించకుండా వార్తలను ప్రచురిస్తుంటాయి. దీన్ని ఆయా వార్తా సంస్థల సంపాదకుల విజ్ఞతకే వదిలేద్దాం" అని అన్నారు.



Go Back to Shorts
KTR
CNN News 18
KCR
PM
Yagas
Twitter

More Telugu News