కేంద్రమంత్రి రాంకృపాల్ యాదవ్ చేతిని నరికేయాలన్నంత కోపం వచ్చింది!: లాలు కుమార్తె మిసా భారతి
- 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరిన కృపాల్ యాదవ్
- ఆ ఎన్నికల్లో మిసా భారతిపై గెలుపు
- ఆయనపై గౌరవం పూర్తిగా పోయిందన్న భారతి
కృపాల్ యాదవ్ ఒకప్పుడు లాలు కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మిసా భారతిపై పోటీ చేసి విజయం సాధించారు. కృపాల్ యాదవ్ అంటే తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ బీజేపీతో ఆయన చేతులు కలిపి, సుశీల్ కుమార్ మోదీ పక్కన నిల్చున్నాక ఆయన మీద ఉన్న గౌరవం మొత్తం పోయిందని మిసా భారతి పేర్కొన్నారు.