బర్గర్ షాపు ఎదుట క్యూలో ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
- బర్గర్ షాపు ముందు సాధారణ వ్యక్తిలా గేట్స్
- వైరల్ అవుతున్న ఫొటో
- నిరాడంబరతకు ఆయన కేరాఫ్ అంటూ ప్రశంసలు
ఓ బర్గర్ దుకాణం వద్ద ఆయన ఓ సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం దర్పం లేకుండా, ఓపిగ్గా తన వంతు కోసం ఎదురుచూస్తున్న ఆయన నిరాడంబరతకు నెటిజన్లు హేట్సాఫ్ చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఆయన పర్యాయపదమంటూ ప్రశంసిస్తున్నారు.