కేసీఆర్ జీ.. రేపు కోల్ కతా ర్యాలీకి రండి!: ఆహ్వానించిన మమతా బెనర్జీ
- తెలంగాణ సీఎంకు టీఎంసీ అధినేత్రి ఫోన్
- 20 మంది నేతలు హాజరవుతున్నారన్న మమత
- దూరంగా ఉండాలనుకుంటున్న కేసీఆర్
కాగా, రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ లతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును కేసీఆర్ ప్రతిపాదించారు.