Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని మోదీని లేపేస్తున్నా.. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పిన దర్జీ.. పరుగులు పెట్టిన పోలీసులు!

  • మద్యం మత్తులో ఫోన్ కాల్
  • ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతానికి చెందిన టైలర్ 
  • నిందితుడు మంచోడేనని తేల్చిన పోలీసులు
మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీసు కంట్రోలు రూంకు ఫోన్ చేసి ప్రధాని నరేంద్రమోదీని హత్య చేయబోతున్నానని చెప్పి కలకలం రేపాడు. అతడి ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు, ఇంటెలిజన్స్ అధికారులు ఫోన్ నంబరు ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

స్థానికంగా దర్జీ పనిచేసుకుంటూ జీవిస్తున్న ముక్తియార్ అలీ (53) వ్యాపారంలో బాగా నష్టపోయాడు. ఆ ఒత్తిడిలో ఉన్న అలీ పూటుగా మద్యం తాగొచ్చి పోలీసు కంట్రోలు రూంకు ఫోన్ చేశాడు. ప్రధానిని చంపేయబోతున్నానని చెప్పి పెట్టేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ముక్తియార్ ఫోన్‌తో కదిలిన పోలీసులు ఫోన్ నంబరు ఆధారంగా అలీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలీ మంచోడేనని, మద్యం మత్తులోనే కంట్రోలు రూంకు ఫోన్ చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడిపై గతంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు పేర్కొన్నారు.
New Delhi
Narendra Modi
police control room
Tailor

More Telugu News