'కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను...': ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం!
- ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్
- అంతకు ముందు అమరవీరులకు నివాళి అర్పించిన కేసీఆర్
అంతకు ముందు ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు కేసీఆర్ వెళ్లారు. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
