Telugudesam: పార్టీ మారాలనుకుంటే చంద్రబాబుకు చెప్పే వెళతా!: ఎమ్మెల్యే మేడా

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీలోని వారే తాను పార్టీ మారుతానని ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. బుధవారం రాజంపేటలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న ఆరోపణలు ప్రతిపక్షం నుంచి రావడం లేదని, సొంత పార్టీ వారి నుంచే వస్తున్నాయని, దీని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుందని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడాలని భావిస్తే, సీఎం చంద్రబాబునాయుడికి చెప్పే పార్టీ మారుతానని ఆయన అన్నారు. పార్టీలో తాను ఎదుగుతుంటే, చూడలేని కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మేడా ఆరోపించారు.
Go Back to Shorts
Telugudesam
Rajampet
Meda
MLA

More Telugu News