టీడీపీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించిన చంద్రబాబు

  • పది అనుబంధ సంఘాలకు అధ్యక్షుల ప్రకటన
  • గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు
  • తెలుగు మహిళ అధ్యక్షురాలిగా  పోతుల సునీత
తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షులను నియమించారు. మొత్తం పది అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్లను బుధవారం సాయంత్రం సీఎం వెల్లడించారు. తెలుగు యువత అధ్యక్షుడిగా  దేవినేని అవినాశ్ (కృష్ణా), తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పోతుల సునీత (ప్రకాశం), తెలుగు రైతు అధ్యక్షుడిగా కంభం విజయరామిరెడ్డి (నెల్లూరు), బీసీ సెల్‌ అధ్యక్షుడిగా బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ (గుంటూరు), ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా ఎంఎస్‌ రాజు (అనంతపురం), ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎంవీవీ ప్రసాద్‌ (విశాఖపట్నం)లను నియమించారు.

ఇక, మైనారిటీ సెల్‌‌కు ఇంతియాజ్‌ అహ్మద్‌ (కర్నూలు),  క్రిస్టియన్‌ సెల్‌‌కు మద్దిరాల జోసెఫ్‌ ఇమ్మాన్యువల్‌ (గుంటూరు), టీఎన్‌టీయూసీకి బి. నరేశ్‌ కుమార్‌ రెడ్డి (చిత్తూరు), అంగన్‌వాడీ యూనియన్‌‌కు భీమినేని వందనాదేవి (గుంటూరు)లను అధ్యక్షులుగా నియమించారు. వీరిలో ముగ్గురు అధ్యక్షులు గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
pothula sunitha
Devineni Avinash
Guntur District

More Telugu News