మార్చిలో మార్పులు.. ఏప్రిల్ లో సునామీ వస్తుంది: ఏపీ రాజకీయాలపై కేఏ పాల్
- నన్ను కొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
- హెలికాప్టర్ తో ప్రచారానికి నిరాకరించారు
- ఏపీకి కాబోయే సీఎం నేనే
తనను కొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని... రేవంత్ రెడ్డి మాదిరి తనను వలవేసి పట్టుకోవాలని చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. హెలికాప్టర్ తో ప్రచారానికి తనకు అనుమతి నిరాకరించారని... అందుకే ఇన్నోవా కార్లతోనే ప్రచారానికి వెళ్లానని చెప్పారు. జగన్ కోసం కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈనాటి భేటీతో టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీలు ఒకటనే విషయం తేలిపోయిందని చెప్పారు. తాను సీఎం అయిన తర్వాత కేసీఆర్ తో కలసి పని చేస్తానని తెలిపారు.