తారక్ అన్ని విషయాలు చెప్పారు.. కేసీఆర్ ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నాం: జగన్
- పార్లమెంటులో జరుగుతున్న అన్యాయాలను చూస్తున్నాం
- తెలంగాణ ఎంపీలు కూడా మద్దతిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుంది
- రాష్ట్రాలు కలిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది
ఏపీకి సంబంధించి పార్లమెంటులో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నామని... 25 మంది ఎంపీలతో పార్లమెంటులో చేసేదేమీ ఉండదని... తెలంగాణలోని 17 మంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తే... అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి మెరుగవుతుందని జగన్ చెప్పారు. రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో తానే వచ్చి మరింత లోతుగా చర్చిస్తానని కేసీఆర్ ఫోన్ లో చెప్పారని తెలిపారు.
తమ సమావేశంలో కేటీఆర్ చెప్పిన అన్ని విషయాలపై పార్టీలో తాము మరింత లోతుగా చర్చించి, రాబోయే రోజుల్లో దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.