ప్రతిష్ఠాత్మక పదవికి ఇంద్రానూయి పేరు ప్రతిపాదన... స్వయంగా నామినేట్ చేసిన ఇవాంకా ట్రంప్!
- ఆగస్టు 2018లో పెప్సీ కోను వీడిన ఇంద్రనూయి
- వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేషన్
- సభ్య దేశాలు ఆమోదించే అవకాశాలు
దీంతో అధ్యక్ష ఎన్నిక అనివార్యం కాగా, 12 ఏళ్లు పెప్సీ కో సీఈఓగా పనిచేసిన ఇంద్రనూయి పేరు తెరపైకి వచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్ లో పెప్సీ కో నుంచి ఇంద్రనూయి వైదొలగారు. వరల్డ్ బ్యాంక్ లో అతిపెద్ద భాగస్వామిగా అమెరికా ఉన్నందున, ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశాలు పుష్కలం. ఇక ఇవాంక నామినేషన్ ను పలు సభ్య దేశాలు ఆమోదించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత శక్తిమంతురాలైన మహిళల జాబితాలో ఇంద్రనూయి పేరు పలుమార్లు చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.