బ్రిటన్ ప్రధానికి పార్లమెంటులో ఎదురుదెబ్బ.. బ్రెగ్జిట్‌పై ఓటింగ్‌లో థెరిస్సా ఓటమి
- బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432, అనుకూలంగా 202 ఓట్లు
- ప్రధానిపై అవిశ్వాస తీర్మానం
- ప్రవేశపెట్టిన ప్రతిపక్ష లేబర్ పార్టీ
బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేయాలన్న ప్రధాని అభ్యర్థనను సభ్యులు పట్టించుకోలేదు. ఫలితంగా థెరిస్సా మే ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధానిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం కనుక నెగ్గితే, మెజారీ పార్టీ ఆ తర్వాత విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు రెండు వారాల గడువు ఉంటుంది. నిర్దేశిత గడువులోపు విశ్వాస తీర్మానంలో నెగ్గలేకపోతే బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు.