మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏపీకి చాలా నష్టం: గల్లా

  • ఏపీకి మోదీ ఏమీ ఇవ్వరు
  • జగన్ కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే
  • మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ కు అవకాశమే లేదు
కేంద్రంలో ఏర్పడబోయేది బీజేపీ, బీజేపీయేతర కూటమి ప్రభుత్వమేనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ ఏర్పడే అవకాశమే లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని... మోదీ మరోసారి ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఏపీకి మోదీ ఏమీ ఇవ్వరని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ కు ఓటు వేస్తే...పరోక్షంగా బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని అన్నారు. 
Go Back to Shorts
modi
jagan
Chandrababu
galla jaydev
Telugudesam
bjp
YSRCP

More Telugu News