ఐదేళ్ల క్యాన్సర్ పోరాటంలో విజయం సాధించిన బాలీవుడ్ హీరో కుమారుడు!
- 2014 నుంచి క్యాన్సర్
- ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు
- మీరూ ఈ పోరాటంలో విజయం సాధిస్తారు
ఈ విషయాన్ని పేర్కొంటూ ఆనందంతో ఇమ్రాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కాకుండా తన కుమారుడితో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. ‘ఐదేళ్ల తర్వాత ఇవాళ అయాన్ క్యాన్సర్‌ను జయించాడని వైద్యులు వెల్లడించారు. అయాన్ కోసం ప్రార్థనలు చేసి, విష్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మంది కోసం నేను ఎప్పుడూ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను. మీరు క్యాన్సర్‌తో జరుపుతున్న ఈ పోరాటంలో విజయం సాధిస్తారు’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.