ఈ సంక్రాంతి పండుగ నవ్యాంధ్రకు నవక్రాంతి కావాలని కోరుకుంటున్నా!: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ నవ్యాంధ్రప్రదేశ్ కు నవ క్రాంతి కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘‘నిరుపేదల కళ్లలో వెలుగు చూడటమే నాకు నిజమైన సంక్రాంతి. ఈ సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవ క్రాంతి అవ్వాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ 'మకర సంక్రాంతి' శుభాకాంక్షలు. పెన్షన్లను రెట్టింపు చేసి ఇంటికి పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇవ్వడం నాకెంతో సంతృప్తినిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.