'ఎఫ్ 2' దూకుడు మాములుగా లేదు
- సంక్రాంతి బరిలోకి చివరిగా దిగిన 'ఎఫ్ 2'
- తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను అదే జోరు
- ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు 13 కోట్లు
అమెరికా వసూళ్ల విషయానికి వస్తే, రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు 5 కోట్లను రాబట్టింది. కుటుంబ సమేతంగా చూస్తూ హాయిగా నవ్వుకునే కంటెంట్ కావడం వల్లనే అక్కడ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కినట్టు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పండుగ సెలవులు నడుస్తుండటంతో, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ 'కథానాయకుడు' .. చరణ్ 'వినయ విధేయ రామ' థియేటర్స్ లో ఉండగా, ఈ సినిమా ఈ స్థాయి దూకుడు చూపిస్తుండటం విశేషమే.