'వినయ విధేయ రామ' నుంచి ఆ సీన్స్ లేపేస్తారా?
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన చరణ్ మూవీ
- యాక్షన్ సీన్స్ పై ఆడియన్స్ అసహనం
- మెగా అభిమానుల్లో నిరాశ
అయితే ఎమోషన్స్ సంగతి అలా ఉంచితే యాక్షన్ సీన్స్ అతిగా వున్నాయనే టాక్ వచ్చింది. ట్రైన్ సీన్ .. విలన్ ను కరిచి పామే చచ్చిపోవడం వంటి సీన్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ తరహా యాక్షన్ సీన్స్ వలన డామేజ్ ఎక్కువగా ఉందని గ్రహించిన టీమ్, ఆ సీన్స్ ను లేపేసే ఆలోచన చేస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ సీన్స్ ను తొలగించడం వలన కొంతవరకూ ఫలితం ఉండొచ్చునని భావిస్తున్నారట. తమ హీరో పడిన కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం పట్ల అభిమానులు నిరాశకి లోనయ్యట్టుగా తెలుస్తోంది.