పెట్రోల్, డీజిల్ పై నేడు కూడా వడ్డనే!

  • లీటరు పెట్రోలుపై 38 పైసలు పెంపు
  • 49 పైసలు పెరిగిన డీజిల్ ధర
  • ఢిల్లీలో రూ. 70.13కి లీటరు పెట్రోల్
పెట్రోలు, డీజిల్ ధరలు భోగి పండగ నాడు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. లీటరు పెట్రోలుపై 38 పైసలు, డీజిల్ పై 49 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఐఓసీ ప్రకటించింది.

 పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 70.13కు చేరగా, డీజిల్ ధర రూ. 64.18కి పెరిగింది. ముంబైలో పెట్రోలుపై 38 పైసలు, డీజిల్ పై 52 పైసల మేరకు ధర పెరిగింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ. 75.77కు, డీజిల్ ధర రూ. 67.18కి చేరింది. ఆదివారం నాడు పెట్రోలు ధర ఏకంగా 60 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే పెట్రోలు ధర లీటరుకు ఒక రూపాయి పెరిగినట్లయింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News