హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న కౌశల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న కౌశల్?

  • 'బిగ్ బాస్ 2' విజేతగా నిలిచిన కౌశల్ 
  • బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ 
  • హీరోగా 'సేనాని' సినిమా  
'బిగ్ బాస్ 2' షోలో పాల్గొన్న కౌశల్ విజేతగా నిలవడమే కాకుండా, ఆ షో ద్వారా ఎంతోమంది మనసులను కూడా గెలుచుకున్నాడు. మోడలింగ్ నేపథ్యం కలిగిన కౌశల్ గతంలో కొన్ని టీవీ సీరియల్స్ లోను నటించాడు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. హీరో కావాలనేది తన లక్ష్యమని కొన్ని ఇంటర్వ్యూస్ లోను ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టు తెలుస్తోంది.

ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో, హీరోగా చేయడానికి కౌశల్ అంగీకరించినట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నాడనీ, ఆయనకి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి 'సేనాని' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. సమకాలీన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
kaushal

More Telugu News