'వినయ విధేయ రామ' తొలి రోజు వసూళ్ల అంచనా 40 కోట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వినయ విధేయ రామ' తొలి రోజు వసూళ్ల అంచనా 40 కోట్లు

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'వినయ విధేయ రామ'
  • అన్ని ప్రాంతాల్లో భారీ ఓపెనింగ్స్
  • బోయపాటి - చరణ్ కాంబినేషన్ పై క్రేజ్  
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా రూపొందిన 'వినయ విధేయ రామ' ప్రపంచ వ్యాప్తంగా నిన్ననే థియేటర్లకు వచ్చింది. చరణ్ ఇంతకు ముందు చేసిన 'రంగస్థలం' సినిమా తొలి రోజున 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'వినయ విధేయ రామ' సినిమాకి డివైడ్ టాక్ రావడం వలన, తొలిరోజు 40 కోట్ల గ్రాస్ ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య .. భారీ తారాగణంతో ఈ సినిమా విడుదల కావడం వలన ఓపెనింగ్స్ కూడా భారీగానే వున్నాయి. అందువలన 40 కోట్ల గ్రాస్ .. 25 కోట్ల షేర్ తొలి రోజున సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో తొలి రోజు వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా అధిగమించే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. మాస్ హీరోగా చరణ్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఇక యాక్షన్ తో పాటు ఎమోషన్ ను అద్భుతంగా ఆవిష్కరించడంలో బోయపాటి సిద్ధ హస్తుడు. ఈ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అసలు వసూళ్లు ఈ అంచనాలకి ఎంత దగ్గరగా వుంటాయో చూడాలి. 
charan
kiara adwani

More Telugu News