19న కోల్‌కతాలో భారీ ర్యాలీ.. కీలక పాత్ర పోషించనున్న చంద్రబాబు
- ర్యాలీకి హాజరుకానున్న పలువురు నేతలు
- కేసీఆర్‌కు మమత ఆహ్వానం
- ర్యాలీ అనంతరం ‘మహాకూటమి’కి రూపు
ర్యాలీకి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మమత ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అలాగే, మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ర్యాలీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ర్యాలీకి హాజరు కానున్నట్టు సమాచారం.
కోల్‌కతా ర్యాలీ తర్వాత జాతీయ స్థాయిలో ‘మహాకూటమి’కి ఓ రూపు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ఈ నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ర్యాలీ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.