సంక్రాంతి పండగ రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు!
- తమ స్వస్థలాలకు బయలుదేరిన ప్రజలు
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ
- టోల్ ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్ల ఏర్పాటు
ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం లేదు కానీ, సాధారణ ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పట్లేదు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది.