'బిగ్ బాస్ 3' హోస్టింగ్ గురించి వెంకటేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 3' హోస్టింగ్ గురించి వెంకటేశ్

  • వెంకీ హీరోగా రేపు రానున్న 'ఎఫ్ 2'
  • ప్రమోషన్స్ లో బిజీగా వెంకీ
  • అదంతా ప్రచారం మాత్రమే  
వెంకటేశ్ .. అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'ఎఫ్ 2' సినిమా రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా రేపు భారీస్థాయిలో విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వెంకటేశ్ బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ 3' షోకి తాను హోస్ట్ గా వ్యవహరించనున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావించారు.

'బిగ్ బాస్ 3' షోకి నేను హోస్ట్ గా చేయనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా కేవలం రూమర్ మాత్రమే' అని స్పష్టం చేశారు. 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు వెంకటేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్త తరువాతనే చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై చిరంజీవి ఏమంటారో .. 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 
venkatesh

More Telugu News