ఎస్పీ ఆఫీసులో పేలిన తుపాకీ.. హడలిపోయిన పోలీస్ అధికారులు!
- ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
- కానిస్టేబుల్ తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదం
- విచారణకు ఆదేశించిన ఎస్పీ రాజశేఖర్ బాబు
తుపాకి పేలడంతో ఎస్పీ ఆఫీసు ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. దీంతో అక్కడకు పరుగుపరుగున చేరుకున్న అధికారులు.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు విచారణకు ఆదేశించారు.