కేసీఆర్ కోసం కొత్త కార్లు.. మెర్సిడెజ్ బెంజ్ కు నో చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి!
- ప్రడోస్, ఫార్చునర్ కార్లు వాడుతున్న కేసీఆర్
- కొత్త కార్లకు మైన్ ప్రూఫింగ్ చేయించనున్న అధికారులు
- త్వరలోనే కాన్వాయ్ లో చేరనున్న కొత్తకార్లు
కేసీఆర్ గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తరచుగా వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రోడ్లను తట్టుకునేలా టయోటా కార్లను కొనాలని ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు నిర్ణయించారు. మొత్తం 7-10 కార్లను సీఎం కాన్వాయ్ లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ కార్లను కొనుగోలు చేశాక మైన్ ప్రూఫింగ్ చేయించనున్నారు. తద్వారా కాన్వాయ్ పై ఎలాంటి దాడులు జరిగినా తట్టుకోవడం వీలవుతుంది. ప్రస్తుతం కేసీఆర్ వాడుతున్న ప్రడో కారు ధర రూ.93 లక్షలు కాగా, ఫార్చునర్ కారు రూ.33 లక్షలుగా ఉంది.