Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సర్.. మర్యాదగా చెబుతున్నా.. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి!: బాలకృష్ణకు నాగబాబు వార్నింగ్

  • చిరంజీవిపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు
  • బాలయ్య చిన్నపిల్లాడని చిరు వదిలేశారు
  • ఆరో వీడియో విడుదల చేసిన నాగబాబు
నందమూరి బాలకృష్ణ ఓసారి మీడియాతో మాట్లాడుతూ..‘చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు’ అని వ్యాఖ్యానించారని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ఈ క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వచ్చిందన్నారు. ఈ మాటలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. దీంతో చిరంజీవి స్పందిస్తూ..‘బాలయ్య చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు’ అని వదిలేశారని గుర్తుచేశారు.

రిక్షా తొక్కే వ్యక్తి ఆయన కొడుక్కి గొప్ప కావొచ్చనీ, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు.

అందులో బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు’ అని చెబితే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో, పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? ఎంత అహంకారం మీకు? మాకు కోపాలు రావా? సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని ఎవరైనా అంటే మాత్రం 100 శాతం రియాక్ట్ అవుతాం. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్ ను ఆపేస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలనీ, రాజకీయ విమర్శలు చేయొచ్చని నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి వాటిపై తాను రియాక్ట్ కాబోనన్నారు. చిరంజీవి అంటే కేవలం తమకు అన్నయ్య మాత్రమే కాదనీ, తండ్రితో సమానమని వ్యాఖ్యానించారు. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, కానీ తాము ముగ్గురం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఇకపై తాను బాలయ్య జోలికి రాబోననీ, కానీ తమ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే తాను మళ్లీ రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇండస్ట్రీ మొత్తం బాలయ్యకు గులాములు కాదన్నారు. ‘థ్యాంక్యూ బాలయ్య గారూ.. ఇకపై మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం. మెగా ఫ్యాన్స్ కు ఒకటే విన్నపం.. మనం చెప్పాల్సింది చెప్పాం. ఇకపై దీన్ని ఇష్యూ చేయకండి. మహేశ్ బాబు ఫ్యాన్స్ కావొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావొచ్చు. మెగా ఫ్యాన్స్ కావొచ్చు. మనమంతా మనుషులమే. ఆ తర్వాతే అభిమానులం’ అని నాగబాబు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telangana
Tollywood
Balakrishna
nagababu

More Telugu News