అజిత్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

  • నేడు విడుదలైన ‘విశ్వాసం’
  • భారీ కటౌట్ ఏర్పాటు
  • ఎక్కువ మంది ఎక్కడంతో ప్రమాదం
తమిళనాడులోని తిరుకొవిళూరులో ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలింది. నేడు అజిత్, నయనతార జంటగా నటించిన ‘విశ్వాసం’ సినిమా విడుదల అయింది.

ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు తిరుకొవిళూరులో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా విడుదలైన సందర్భంగా ఆ కటౌట్‌ పైకి ఎక్కువ మంది అభిమానులు ఎక్కి పాలాభిషేకం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Ajith kumar
Tamilnadu
Nayanatara
Viswasam
Hospital

More Telugu News