Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వేతనాన్ని అందుకున్న యాపిల్ సీఈవో

  • 2017తో పోలిస్తే 22 శాతం ఎక్కువ
  • భారీగా విక్రయాలు.. భారీ బోనస్
  • 15.7 మిలియన్ డాలర్లు అందుకున్న కుక్
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గత ఏడాది భారీ వేతనాన్ని అందుకున్నారు. కంపెనీ ఆయన వేతనాన్ని పెంచడంతో భారీ పెరుగుదల కనిపించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి కమిషన్ వద్ద దాఖలైన సమాచారం ప్రకారం.. కుక్‌కు పెంచిన వేతనం 2017తో పోలిస్తే 22 శాతం ఎక్కువ. అంటే 2018లో ఆయన 15.7 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.110 కోట్లు.

ఇందులో మూల వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, మరో 12 మిలియన్ డాలర్లను బోనస్‌గా.. మిగిలిన 6,80,000 డాలర్లను ఇతర ఖర్చుల కింద కుక్‌ పొందారు. గత ఏడాది కాలంలో యాపిల్ భారీగా విక్రయాలు జరుపుకోవడంతో కుక్‌కు భారీ బోనస్ అందజేసినట్టు ఆ సంస్థ వేతన కమిటి వెల్లడించింది.


Apple CEO
Tim Cook
Salary
Sales

More Telugu News