నీటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్.. వికారాబాద్ జిల్లాలో కలకలం
- నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ కిడ్నాప్
- పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
- బాధిత కుటుంబ సభ్యులను కలిసిన రేవంత్ రెడ్డి
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వనాథ్ గెలుపొందారు. విశ్వనాథ్ కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకుని విశ్వనాథ్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణకు ఫోన్లో విషయాన్ని వివరించి విశ్వనాథ్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. నిర్మల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.