ఏడు పదుల వయసులో.. 23 దేశాలు తిరిగొచ్చిన 'ఛాయ్ వాలా' దంపతులు!
- కాఫీ హౌస్‌ను నడుపుతున్న విజయన్ జంట
- టీ కొట్టును తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు
- తిరిగొచ్చాక కష్టపడి అప్పు కట్టేస్తారు
ప్రతి పర్యటనకు ముందు తమ టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు. వీళ్ల గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర.. ఈ జంట గురించి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దేశంలోని అత్యంత ధనికులు వీళ్లేనని.. కొచ్చికి వెళ్లినపుడు విజయన్ టీకొట్టుకు వెళ్లి టీ తాగి వస్తానని ట్వీట్లో పేర్కొన్నారు.