'కథానాయకుడు' సినిమాపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందన

  • మనుషులు మహాపురుషులవుతారని నిరూపించిన కారణజన్ముడు ఎన్టీఆర్
  • ఆయన పాత్రను అద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్
  • క్రిష్, కీరవాణి, విద్యాబాలన్ లకు అభినందనలు
దివంగత ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన 'కథానాయకుడు' ఈరోజు విడుదలైంది. తొలి షోతోనే హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనీ,మహాపురుషులవుతారనీ నిరూపించిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆ మహానుభావుడి పాత్రను అత్యద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్. డైరెక్టర్ క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, విద్యాబాలన్ మొదలైన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా నా అభినందనలు' అని తెలిపారు. 
Go Back to Shorts
raghavendra rao
Balakrishna
krish
vidyabalan
kathanayakudu
tollywood

More Telugu News