వైసీపీలో చేరిన బీసీ సంఘం నేత బుద్ధా నాగేశ్వరరావు

  • శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్‌ సమక్షంలో చేరిక
  • ప్రభుత్వ విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు ఇతను సోదరుడు
  • పార్టీ బీసీలకు అండగా ఉందన్న బుద్ధా
ప్రభుత్వ విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు, బీసీ సంఘం నేత బుద్ధా నాగేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ తగిలినట్టయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచుకున్నారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ జగన్‌ వైసీపీ కండువా  మెడలో వేశారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో బీసీలకు ఎంతో న్యాయం జరిగిందని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు  ప్రకటించారు. తన సోదరుడు బుద్ధా వెంకన్న బీసీల కోసం ఏనాడూ పోరాడలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Go Back to Shorts
YSRCP
Budha nageswara rao
bc union

More Telugu News