లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
- పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన రాజ్ నాథ్
- ఈ బిల్లుపై టీఎంసీ తీవ్ర ఆందోళన
- సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్
కాగా, పౌరసత్వ సవరణ బిల్లుపై టీఎంసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో అస్సాంతో బీజేపీ ప్రభుత్వానికి మిత్ర పక్షం అస్సాం గణపరిషత్ (ఏజీపీ) తమ మద్దతు ఉపసంహరించుకుంది.
అంతకుముందు, లోక్ సభలో రాజ్ నాథ్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ బిల్లు దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని అన్నారు. ఈ బిల్లు కేవలం అసోంకే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని అన్నారు.