అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం!
- 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు నిర్ణయం
- లాభపడనున్న అగ్రవార్ణాల పేదలు
- 124వ రాజ్యాంగ సవరణ చేపట్టే అవకాశం
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం కింద విద్య, ఉద్యోగాల్లో ఓసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుత్ లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి ఉన్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే ఈ బిల్లు చట్టంగా మారితే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుకుంటాయి.