200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోన్న 'సింబా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోన్న 'సింబా'

  • తొలివారంలో 150 కోట్లు 
  • రెండవ వారంలో 39.83 కోట్లు
  • ఓవర్సీస్ లో 100 కోట్ల క్లబ్ కి చేరువలో       
తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి రీమేక్ గా హిందీలో 'సింబా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్లపరంగా దూసుకుపోతోంది. తొలివారంలో ఈ సినిమా 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. రెండవవారంలో 39.83 కోట్లను వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఈ సినిమా 190.64 కోట్లను రాబట్టింది. 3వ వారంలో 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం వసూళ్లు 250 కోట్ల మార్క్ ను అందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓవర్సీస్ విషయానికే వస్తే, ఇంతవరకూ 72.88 కోట్లు వసూలు చేసి .. 100 కోట్ల మార్కును అందుకోవడానికి పరుగులు తీస్తోంది. మొత్తానికి తెలుగు 'టెంపర్' .. రణ్ వీర్ సింగ్ కి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టేసిందన్న మాట.
ranveer

More Telugu News