దాసరిగారి వల్లనే డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాను: సీనియర్ హీరోయిన్ సరిత
- 4 భాషల్లో 160కి పైగా సినిమాలు
- అగ్రస్థాయి హీరోల సరసన నటన
- స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్
"నా వాయిస్ బాగుంటుందని నాకే తెలియదు. 'మరో చరిత్ర' సినిమా సమయంలో డబ్బింగ్ చెప్పడానికి నేను టెన్షన్ పడుతుంటే వేరే వాళ్లతో చెప్పిద్దామనుకున్నారు. కానీ అక్కడున్న ఇంజనీర్ నా వాయిస్ బాగుందని చెప్పి .. నాకు కొంచెం టైమ్ ఇచ్చేలా చేశారు. అలా హీరోయిన్ గా నేను బిజీగా వున్నప్పుడే దాసరి గారు 'గోరింటాకు' సినిమాలో సుజాత గారికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. అప్పటి నుంచి డబ్బింగ్ అంటే ఇష్టం పెరిగింది. విజయశాంతి .. రాధ .. సుహాసిని .. నగ్మా .. సౌందర్య వంటి స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను" అని అన్నారు.