Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒళ్లంతా టాటూ .. ఎంతో బాధను భరించాను: చరణ్

  • టాటూ వేయడానికి 2 గంటలు పట్టేది 
  • టాటూ తీసేటప్పుడు బాగా నొప్పి ఉండేది 
  • కైరా అద్వాని కళ్లు బాగుంటాయి
చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా నిర్మితమైంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటార్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో పేరుకి తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది.  రాముడితో యుద్ధం చేయాలని ఎవరూ అనుకోకూడదు. నేను కూడా ఈ సినిమాలో అలాగే కనిపిస్తాను.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఒంటినిండా టాటూతో కనిపిస్తాను. అది స్టిక్కర్లతో వేసిన టాటూ .. అది వేయడానికి 2 గంటలు .. తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఆ స్టిక్కర్ తీసేటప్పుడు చాలానొప్పిగా ఉండేది .. అయినా అలాగే భరించాను. గతంలో తమన్నా మంచి డాన్సింగ్ పార్ట్నర్ అనిపించింది. మళ్లీ ఇప్పుడు కైరా అద్వాని మంచి డాన్సింగ్ పార్ట్నర్ గా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు. ఇక కైరా అద్వాని కళ్లు కూడా చాలా బాగుంటాయని కితాబునిచ్చాడు. 
charan
kiara adwani

More Telugu News