మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసలు
- మహిళలకు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన గడ్కరీ
- ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గురించి ప్రస్తావన
- మహిళా రిజర్వేషన్ లేకుండా రాణించిన నేత ఇందిర
ఈ సందర్భంగా తమ పార్టీకి చెందిన మహిళా నేతలు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే రాజకీయాల్లో దూసుకెళ్తున్నారని కొనియాడారు. ఎవరైనా తమ ప్రతిభ ఆధారంగానే రాణించాలి తప్ప, కులమతాలు, ప్రాంతం, భాష వంటి అంశాలను ఆధారం చేసుకుని కాదన్న గడ్కరీ, మహిళా రిజర్వేషన్ కు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులమతాల ఆధారంగా చేసే రాజకీయాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు.